రేవంత్ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం
- మీకు హిట్లరే స్ఫూర్తి అంటూ ఎద్దేవా
- మీ హంతక ఏజెన్సీ పేరు హైడ్రా అని విమర్శ
- తమ పాలన అంబేద్కర్, గాంధీ ఆశయాలకు అనుగుణమని వెల్లడి
- బెంగళూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పోస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి హిట్లరే స్ఫూర్తి అని, ఆయన నియంతలను పూజిస్తారని ఆరోపించారు. నిన్న బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"మీ స్ఫూర్తి హిట్లర్! మీ హంతక ఏజెన్సీ పేరు హైడ్రా! మీరు నియంతలను పూజిస్తూ, కూల్చివేతల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు" అని కేటీఆర్ తన పోస్టులో ఘాటుగా విమర్శించారు. "మేం మీ అంత తెలివైన వాళ్లం కాదు రేవంత్! అందుకే మేం అంబేద్కర్ రాజ్యాంగం, గాంధీజీ దార్శనికత, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పాలించాం" అని పేర్కొన్నారు.
నిన్న బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైడ్రా పేరు వెనుక తనకు స్ఫూర్తి హిట్లర్ అని వెల్లడించారు. హిట్లర్ కు హైడ్రా అనే టీమ్ ఉండేదని, హిట్లర్ ప్రత్యర్థుల పనిబట్టడమే ఆ టీమ్ పని అని పేర్కొన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.